Thu Dec 12 2024 21:50:34 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం.. జమిలి ఎన్నికలపై
ఈరోజు కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది
ఈరోజు కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ప్రధానంగా రైతులు ఆందోళనపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించే అవకాశముంది. అలాగే వివిధ ముఖ్యమైన అంశాలు ప్రస్తావనకు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో వచ్చే అవకాశముంది.
పార్లమెంటు సమావేశాల్లో...
మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. జమిలి ఎన్నిక బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. జమిలి ఎన్నికలకు వెళ్లాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పార్లమెంటు సమావేశాల్లో జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టడంపై చర్చించనున్నారని తెలిసింది.
Next Story