Mon Dec 23 2024 23:36:16 GMT+0000 (Coordinated Universal Time)
అజెండా అందకుండానే?
మరి కాసేపట్లో కేంద్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. అయితే సమావేశం అజెండా మంత్రులకు చేరకపోవడం చర్చనీయాంశంగా మారింది
మరి కాసేపట్లో కేంద్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. అయితే ఈ సమావేశం అజెండా మాత్రం మంత్రులకు చేరకపోవడం చర్చనీయాంశంగా మారింది. సహజంగా కేబినెట్ భేటీ జరిగే ముందు మంత్రులకు సమావేశంలో చర్చించే అంశాలపై అజెండాను సిద్ధం చేసి అధికారులకు పంపుతారు. అయితే ఎలాంటి అజెండా పంపకుండానే మంత్రివర్గ సమావేశానికి రావాలంటూ ఆహ్వానం పంపారు. ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ మంత్రివర్గ సమావేశం జరగనుంది.
కాసేపట్లో కేబినెట్ భేటీ...
పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో జరుగుతున్న సమావేశం కావడంతో ఈ కేబినెట్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటి వరకూ పార్లమెంటు సమావేశాల్లో రాబోతున్న అజెండాను రహస్యంగా ఉంచిన ప్రభుత్వం కేంద్ర మంత్రి వర్గ సమావేశానికి ముందు కూడా పంపకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సమావేశంలో మహిళ రిజర్వేషన్ బిల్లు పెడతారన్న ప్రచారం పెద్దయెత్తున జరుగుతుంది. అదే సమయంలో మరికొన్ని కీలక నిర్ణయాలు ఉండటంతోనే మంత్రులకు అజెండా ముందుగా పంపలేదంటున్నారు. మరి ఏం జరుగుతుందన్నది మంత్రి వర్గ సమావేశం అనంతరం తెలియాల్సి ఉంది.
Next Story