Fri Nov 22 2024 16:08:51 GMT+0000 (Coordinated Universal Time)
ఈ రాష్ట్రాలు డేంజర్ జోన్ లో...కేంద్రం అలెర్ట్
కొన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ భూషణ్ ఈ మేరకు లేఖ రాశారు
కొన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ భూషణ్ ఈ మేరకు లేఖ రాశారు. ఈ రాష్ట్రాల్లో కోవిడ్ ఆంక్షలను కఠినతరం చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఇక్కడ ఒమిక్రాన్ కేసులతో పాటు కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయని, అన్ని సదుపాయాలను ఇప్పటి నుంచే ఏర్పాటు చేసుకోవాలని ఆయన ఆదేశించారు.
ఎనిమిది రాష్ట్రాలకు...
మొత్తం ఎనిమిది రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ రాసింది. ఢిల్లీ, హర్యానా, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ ,గుజరాత్, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేకంగా తెలియజేసింది. ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పించాలని, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది.
Next Story