Mon Dec 23 2024 09:19:01 GMT+0000 (Coordinated Universal Time)
అమిత్‌షా పర్యటనలో అలజడి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాన్వాయ్ లో ప్రయివేటు వాహనం చొరబడింది. ఆ వాహనం కాన్వాయ్‌లోని ఒక వాహనాన్ని ఢీకొట్టింది
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాన్వాయ్ లో ప్రయివేటు వాహనం చొరబడింది. ఆ వాహనం కాన్వాయ్‌లోని ఒక వాహనాన్ని ఢీకొట్టింది. దీనిని భద్రతాలోపంగా కేంద్ర హోంశాఖ పరిగణిస్తుంది. త్రిపుర ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా అగర్తలా వచ్చారు. నిన్న రాత్రి అగర్తలాలోనే బస చేశారు. అయితే ప్రభుత్వ అతిధి గృహం నుంచి బయలుదేరి వస్తుండగా హోంమంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న కాన్వాయ్ లోకి ఒక ప్రయివేటు వాహనం ప్రవేశించింది.
కాన్వాయ్ లోకి...
ఆ వాహనం కాన్వాయ్ పైకి దూసుకెళ్లడంతో ఒక వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అప్రమత్తమయిన పోలీసులు వెంటనే కారుతో పాటు కారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని ప్రశ్నిస్తున్నారు. త్రిపురకు చెందిన వాహనమే కావడంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. TR01BS0254 నెంబరు గల వాహనంతో కాన్వాయ్ లో వాహనాన్ని ఢీకొట్టారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story