Thu Dec 19 2024 10:47:29 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి అస్వస్థత
సిలిగుడిలోని సేవక్ కంటోన్మెంట్ పరిధిలో నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు గడ్కరీ ..
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. బంగాల్ లోని సిలిగురిలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన.. స్టేజిపై ఉండగానే ఒకింత అసౌకర్యానికి గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు వైద్యుడిని పిలిపించి.. అప్పటికప్పుడు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి మరీ వైద్యుడిని అక్కడికి తరలించారు. గడ్కరీని పరిశీలించిన వైద్యుడు.. ఆయనకు రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గాయని తెలిపారు. వెంటనే సెలైన్ ఎక్కించారు.
సిలిగురిలోని సేవక్ కంటోన్మెంట్ పరిధిలో నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు గడ్కరీ అక్కడికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై కూర్చున్న ఆయన అసౌకర్యానికి గురయ్యారు. కాస్త విశ్రాంతి తీసుకునేందుకు ఆయనకోసం ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్లారు. అక్కడ మరింత అసౌకర్యానికి గురికావడంతో వైద్యుడిని పిలిపించారు. ప్రాథమిక పరీక్షల అనంతరం గడ్కరీని డార్జిలింగ్ ఎంపీ రాజు బిస్తా తన ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ గడ్కరీకి వైద్య సేవలు కొనసాగుతున్నట్టు తెలిపారు.
Next Story