Mon Dec 23 2024 08:08:37 GMT+0000 (Coordinated Universal Time)
నా కూతుని కాంగ్రెస్ టార్గెట్ చేసింది
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్ నేతలపై మండి పడ్డారు. తన కూతురిపై కాంగ్రెస్ అసత్య ఆరోపణలు చేస్తుందన్నారు
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్ నేతలపై మండి పడ్డారు. తన కూతురిపై కాంగ్రెస్ అసత్య ఆరోపణలు చేస్తుందన్నారు. తన కూతురుని టార్గెట్ చేసిందని స్మృతి ఇరానీ ఆరోపించారు. గోవాలో తన కుమార్తెకు ఎటువంటి బార్ లేదని ఆమె తెలిపారు. అమేధీలో రాహుల్ గాంధీని ఓడించినందుకే తన కుటుంబాన్ని కాంగ్రెస్ నేతలు లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తమను అప్రదిష్టపాలు చేసేందుకు కాంగ్రెస్ నేతలు కుట్ర పన్నుతున్నారని స్మృతి ఇరానీ ఆరోపించారు. తనపై వస్తున్న ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని ఆమె సవాల్ విసిరారు.
రెండు బార్ లైసెన్సులు...
కాగా కాంగ్రెస్ స్మృతి ఇరానీ కుటుంబపై తీవ్ర ఆరోపణలు చేసింది. స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ ఇరానీ గోవాలో అక్రమంగా బార్ నడుపుతుందని పేర్కొన్నారు. ఆమెను కేబినెట్ నుంచి వెంటనే బర్త్రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. 2021లో మరణించిన వ్యక్తి పేరు మీద బార్ నడుపుతుందని తెలిపారు. నకిలీ బార్ లైసెన్స్ తో వ్యాపారాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. 2022లో తిరిగి మరణించిన వ్యక్తి పేరు మీద బార్ లైసెన్సు తీసుకున్నారని, ఇది చట్ట విరుద్ధమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా పేర్కొన్నారు. గోవాలో అమలవుతున్న చట్టం ప్రకారం ఒక రెస్టారెంట్ కు ఒక బార్ మాత్రమే పర్మిషన్ ఉంటుందని, కానీ స్మృతి ఇరానీ కుమార్తెకు రెండు బార్ లైసెన్స్ లు అధికారులు ఇచ్చారన్నారు. ఎక్సైజ్ శాఖ ఈ బార్ కు నోటీసులు జారీ చేసిందని కూడా తెలిపారు. అయితే నోటీసులు జారీ చేసిన అధికారిని బదిలీ చేయించారని, ఇది అధికారులపై ఒత్తిడితోనే జరిగిందన్నారు.
Next Story