Sun Dec 22 2024 21:00:49 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్రమంత్రి కాన్వాయ్ పై రాళ్ల దాడి
పశ్చిమబెంగాల్ లోని సొంత నియోజకవర్గమైన కూచ్ బెహర్ లోనే జరగడం గమనార్హం. స్థానిక బీజేపీ కార్యాలయానికి..
కేంద్ర సహాయమంత్రి నిశిత్ ప్రమాణిక్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటన పశ్చిమబెంగాల్ లోని సొంత నియోజకవర్గమైన కూచ్ బెహర్ లోనే జరగడం గమనార్హం. స్థానిక బీజేపీ కార్యాలయానికి మంత్రి వెళ్తుండగా.. దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఈ గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అదే సమయంలో ప్రత్యర్థులపైకి కర్రలు పట్టుకుని వెళ్తున్న బీజేపీ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు.
అయితే.. తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలే ఈ దాడి చేశారని నిశిత్ ప్రమాణిక్ ఆరోపించారు. "ఒక మంత్రికే రక్షణ లేదంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. బెంగాల్ లో ప్రజాస్వామ్యం పరిస్థితి ఎలా ఉందో.. ఈ ఘటనతో తెలిసిపోయింది" అని ఆయన విమర్శించారు. కూచ్ బెహర్ నుంచి ఎంపీగా ప్రమాణిక్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.
Next Story