Mon Nov 25 2024 23:44:17 GMT+0000 (Coordinated Universal Time)
గోదావరి - కావేరి నదుల అనుసంధానంపై?
గోదావరి - కావేరి నదుల అనుసంధానంపై నేడు కేంద్ర జలశక్తి శాఖ సమావేశం నిర్వహించనుంది.
గోదావరి - కావేరి నదుల అనుసంధానంపై నేడు కేంద్ర జలశక్తి శాఖ సమావేశం నిర్వహించనుంది. రెండు నదుల పరివాహక ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాల కార్యదర్శులకు ఆహ్వానం పంపింది. నేడు జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ ఐదు రాష్ట్రాల కార్యదర్శులతో సమావేశమై గోదావరి - కావేరి నదుల అనుసంధానంపై చర్చించనుంది. ఆ యా రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకోనుంది.
మిగులు జలాలను...
ఢిల్లీలోని శ్రమశక్తి భవన్ లో జరగనున్న ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక కార్యదర్శులు పాల్గొంటారు. గోదావరిలో మిగులు జలాలను కావేరీ నదికి తరలించేందుకు లింక్ ప్రాజెక్టుపై చర్చించనున్నారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టు నుంచి కావేరీ నదికి జలాలను తరలించే ప్రాజెక్టు రూపకల్పనపై కూడా చర్చించనున్నారు.
Next Story