Sat Nov 23 2024 03:12:47 GMT+0000 (Coordinated Universal Time)
Aadhaar Update: ఆధార్ పై మరో కీలక అప్డేట్ ఇదే
ఆధార్ కార్డుపై తప్పుడు వదంతలు నమ్మవద్దని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా మరోసారి స్పష్టం చేసింది
ఆధార్ కార్డుపై తప్పుడు వదంతలు నమ్మవద్దని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా మరోసారి స్పష్టం చేసింది. జూన్ 14వ తేదీ లోపు ఆధార్ కార్డును అప్డేట్ చేసుకుంటే ఉచితంగా చేస్తారని తెలిపింది. అయితే ఆ తర్వాత అప్డేట్ చేయాలనుకుంటే మాత్రం కొంత రుసుము తప్పదని యూఐడీఏఐ తెలిపింది. దీనిని సోషల్ మీడియాలో కొందరు వక్రీకరించి పదేళ్లు దాటిన ఆధార్ కార్డు చెల్లదంటూ ప్రచారం చేస్తున్నారని దానిని నమ్మవద్దని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది.
కావాలనే కొందరు...
కొందరు కావాలనే ఈ వదంతులు సృష్టించి అయోమయం ఏర్పరచాలని ప్రయత్నిస్తున్నారి తెలిపింది. జూన్ 14వ తేదీలోపు వ్యక్తి గత వివరాలలో ఏదైనా మార్పులు ఉంటే ఉచితంగా అప్డేట్ చేసుకునే వీలుందని చెప్పింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఎవరూ నమ్మవద్దని కూడకా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. పదేళ్లవుతున్న ఆధార్ కార్డు వారి వివరాలను అప్ డేట్ చేసుకోవాలని సూచించిన మాట వాస్తవమేనని, అయితే మార్పులు ఉంటేనే అప్డేట్ చేసుకోవాలని తెలిపింది.
Next Story