Mon Dec 23 2024 03:51:52 GMT+0000 (Coordinated Universal Time)
మాకు పెళ్లి కావడంలేదంటూ యువకుల వినూత్న నిరసన
క్రాంతి జ్యోతి పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వినూత్న నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పెళ్లికాని యువకులు గుర్రాలపై..
దేశంలో యువత ఎదుర్కొంటున్న సమస్యల్లో పెళ్లి కూడా ఒకటి. పెళ్లీడు వచ్చినా చాలా మంది యువకులకు పెళ్లిళ్లు కావడం లేదు. ఉన్నత ఉద్యోగాలు.. కావలసినంత సంపాదన ఉన్నా.. వారికి వధువులు దొరకట్లేదు. భారత్ లోని మహారాష్ట్రలో ఈ సమస్య కాస్త ఎక్కువగా ఉందనిపిస్తుంది. ఎందుకంటే తమకు పెళ్లీడొచ్చినా.. పెళ్లికావడం లేదంటూ చాలామంది యువకులు వినూత్నరీతిలో ఆవేదన వ్యక్తం చేశారు. షోలాపూర్ జిల్లాలో పెళ్లికాని యువకులు ఈ వినూత్న నిరసనకు తెరలేపారు. గుర్రాలపై కలెక్టరేట్ కార్యాలయంకు ఊరేగింపుగా వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేశారు.
క్రాంతి జ్యోతి పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వినూత్న నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పెళ్లికాని యువకులు గుర్రాలపై వచ్చారు. గుర్రాలపై శోలాపుర్ పట్టణంలో ఊరేగింపుగా కలెక్టరేట్ కార్యాలయంకు వెళ్లి అక్కడే బైఠాయించి .. రాష్ట్రంలో అమ్మాయిల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుందని, పెళ్లి చేసుకునేందుకు వధువు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అమ్మాయిల కొరత ఏర్పడటానికి కారణం.. లింగనిర్ధారణ చట్టం పటిష్టంగా అమలు చేయకపోవటమేనని వారు ఆరోపించారు. ఆడపిల్లల నిష్పత్తి పెరుగుదలకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటూ కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story