Mon Dec 23 2024 02:45:24 GMT+0000 (Coordinated Universal Time)
ఇతడు పోలీసులా నటించి.. ఎంతో మందిని మోసం చేస్తూ
పోలీసు యూనిఫాం ధరించి అతడు అనుమానాస్పదంగా కనిపించాడు. పలువురి దగ్గర డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాడు.
ఫిరోజాబాద్ పోలీసులు ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో పోలీసుగా నటిస్తూ స్థానికుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడిని ఘజియాబాద్‌కు చెందిన ముఖేష్ యాదవ్‌గా గుర్తించారు. ముఖేష్ యాదవ్ నగరంలో వాహనాల నుండి డబ్బు తీసుకుంటుండగా అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి నకిలీ ఆధార్ కార్డు, పోలీస్ ఇన్స్పెక్టర్ నకిలీ ఐడీ కార్డు, పోలీసు యూనిఫాంలో ఉన్న ఫొటో, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఫిరోజాబాద్ పోలీసులు మాట్లాడుతూ 'ముఖేష్ యాదవ్ అనే ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తి టోల్ ట్యాక్స్ చెల్లించకుండా పోలీసు వేషంలో తిరుగుతూ ఉన్నాడని గుర్తించాం. పోలీసు యూనిఫాం ధరించి అతడు అనుమానాస్పదంగా కనిపించాడు. పలువురి దగ్గర డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాడు. అసలైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. తాను పోలీసులా నటించానని ఆ వ్యక్తి అంగీకరించాడు.' అని తెలిపారు. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ప్రకారం, తుండ్ల పోలీస్ స్టేషన్ అధికారులు ముఖేష్‌ను అరెస్టు చేశారు. నకిలీ ఆధార్ కార్డ్, నకిలీ పోలీసు ఐడి కార్డ్‌తో సహా నకిలీ గుర్తింపు రుజువులను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
Next Story