Mon Dec 23 2024 03:48:35 GMT+0000 (Coordinated Universal Time)
నేడు యూపీఎస్సీ పీరీక్ష.. అరగంట ముందుగానే?
నేడు యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష జరుగుతుంది. దేశమంతా ఈ పరీక్షకు సంబంధించి ఎనభై నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు
నేడు యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష జరుగుతుంది. దేశమంతా జరుగుతున్న ఈ పరీక్షకు సంబంధించి ఎనభై నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. కట్టుదిట్టంగా పరీక్షను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను అధకారులు చేశారు. హైదరాబాద్ లోనూ ఈ పరీక్షకు తగిన ఏర్పాట్లను అధికారులు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
రెండు పేపర్లు....
ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకూ పేపర్ 1 పరీక్ష జరుగుతుంది మధ్యాహ్మం 2.30 గంటల నుంచి 4.30 గంటల వకూ పేపర్ 2 పరీక్షను నిర్వహించనున్నారు. అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరుకోవాలని అధికారులు తెలిపారు.
Next Story