Sun Jan 12 2025 01:43:22 GMT+0000 (Coordinated Universal Time)
యూపీఎస్సీ సీఎంఎస్ ఎగ్జామ్ 2022
అభ్యర్థులను రాత పరీక్ష.. పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి..
యూపీఎస్సీ 2022 సంవత్సరానికి కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదలైంది. కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 ద్వారా మొత్తం 687 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు ఇంటర్న్ షిప్, చివరి ఏడాది పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థులను రాత పరీక్ష.. పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులను పంపేందుకు ఏప్రిల్ 26, 2022 చివరి తేదిగా నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ పరీక్ష జులై 17,2022న నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు upsc.gov.in/ వెబ్ సైట్ ను సంప్రదించండి.
Next Story