Mon Dec 23 2024 11:21:21 GMT+0000 (Coordinated Universal Time)
చంపేస్తామంటూ బెదిరింపు కాల్
ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. డయల్ 11కు మెసేజ్ ద్వారా ఈ కాల్ వచ్చినట్లు గుర్తించారు.
ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. డయల్ 11కు మెసేజ్ ద్వారా ఈ కాల్ వచ్చినట్లు గుర్తించారు. త్వరలో తాము యోగి ఆదిత్యానాధ్ను చంపుతామని ఆగంతకుడు హెచ్చరించారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బెదిరింపు కాల్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీసిన పోలీసులకు కాల్ చేసిన వ్యక్తి రిహాన్ గా కనిపెట్టారు. రిహాన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కేసు నమోదు చేసి...
ఇటీవల యోగి ఆదిత్యానాధ్ ప్రభుత్వంలో ఎన్కౌంటర్లు జరుగుతుండటంతో ఎవరు ఈ బెదిరింపు కాల్ చేశారన్న దానిపై తొలుత ఉత్కంఠ నెలకొంది. నిందితుడిని గుర్తించిన పోలీసులు రిహాన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు యోగి ఆదిత్యానాధ్కు మరింత భద్రతను పెంచారు. ఆయన సెక్యురిటీని టైట్ చేశారు. నిందితుడి వెనక ఎవరున్నారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Next Story