Sun Dec 22 2024 21:25:10 GMT+0000 (Coordinated Universal Time)
చార్ధామ్ యాత్రపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి నో ఎంట్రీ
చార్ధామ్ యాత్ర పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల పదో తేదీన చార్ధామ్ యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే
చార్ధామ్ యాత్ర పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల పదో తేదీన చార్ధామ్ యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. పదోతేదీ నుంచి ఆలయ ద్వారాలు తెరుచుకోవడం, భక్తులను అనుమతించడంతో రద్దీ విపరీతంగా ఉంది. అయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ను తప్పని సరి చేసింది. దీంతో పాటు వీఐపీలు ఎవరూ ఆలయానికి రావద్దని, 31వ తేదీ వరకూ వీఐపీలు ఆలయాన్ని దర్శించకుండా ఉంటే మంచి దని తెలిపింది.
31వ తేదీ వరకూ...
కేదార్ నాధ్, బద్రీనాధ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు భక్తుల రద్దీతో ఉండటంతో ఉత్తారాఖండ్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణక్ష్ం తీసుకుంది. వీఐపీ దర్శనాలను ఈ నెల 31వ తేదీ వరకూ నిలిపేయాలని నిర్ణయించింది. సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎవరు వీఐపీలు వచ్చినా అనుమతి ఉండదని, సామాన్య భక్తులు దర్శించుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తరాఖండ్ అధికారులు తెలిపారు.
Next Story