Mon Dec 23 2024 07:00:09 GMT+0000 (Coordinated Universal Time)
రేపటితో కాలం చెల్లు
రేపటితో రెండు వేల రూపాయల నోటు చెల్లుబాటు ముగియనుంది. ఆర్బీఐ రెండు వేల రూపాయల నోటును రద్దు చేసిన సంగతి తెలిసిందే.
రేపటితో రెండు వేల రూపాయల నోటు చెల్లుబాటు ముగియనుంది. ఆర్బీఐ రెండు వేల రూపాయల నోటును రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 30వ తేదీ వరకూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల రూపాయల నోటు మార్పిడి చేసుకునేందుకు అనుమతిచ్చింది. తమ వద్ద ఉన్న రెండు వేల రూపాయల నోటును బ్యాంకుల్లో జమ చేయడానికి రేపటి వరకూ మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే కోట్ల కొద్దీ డబ్బులు బ్యాంకుల్లో అనేక మంది జమ చేశారు. రేపు చివరి తేదీ కావడంతో ఈరోజు, రేపు బ్యాంకుల్లో రెండు వేల నోటు జమ చేయడానికి అత్యధిక మంది వస్తారని బ్యాంకు సిబ్బంది అంచానా వేస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏడేళ్ల నుంచి...
2016లో నవంబరు 8న వెయ్యి రూపాయల నోటును రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం దాని స్థానంలో రెండు వేల రూపాయల నోటును ప్రవేశపెట్టింది. అవినీతి, నల్లధనాన్ని అరికట్టేందుకే ఈ రెండు వేల రూపాయలను ప్రవేశపెట్టినట్లు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే వెయ్యి రూపాయల నోటును రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం అంతకంటే ఎక్కువ విలువైన రెండు వేల రూపాయల నోటును ప్రవేశపెట్టింది. దాదాపు రెండువేల రూపాయల నోటు ఏడేళ్లు చలామణిలో ఉన్నట్లయింది.
రెండేళ్ల నుంచే...
అయితే రెండు వేల రూపాయల నోటు వల్ల చిల్లర సమస్య ఎక్కువగా వేధిస్తుండేది. అంతేకాదు గత రెండేళ్ల నుంచి బ్యాంకుల్లోనూ రెండు వేల రూపాయల నోటు కన్పించడం మానేసింది. ఏటీఎంలలోనూ రెండు వేల రూపాయలు రావడం లేదు. దీంతో ప్రజలకు కూడా రెండు వేల నోటు రద్దవుతుందన్న అనుమానం జనాల్లో మొదలయింది. అనుకున్న మేరకే రెండు వేల రూపాయల నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. అయితే రేపటి వరకూ బ్యాంకుల్లో మార్చుకోవడానికి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది. దీంతో రెండు వేల రూపాయల నోటుకు రేపటితో కాలం చెల్లినట్లవుతుంది.
Next Story