Mon Nov 18 2024 07:27:31 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి వందేభారత్ రైలుపై రాళ్లదాడి
బీహార్ లో వందే భారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. బీహార్ లోని కతిహార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది
భారత్ లో వందే భారత్ రైళ్లను రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. అత్యంత వేగంగా, సురక్షితంగా, సౌకర్యవంతంగా గమ్యస్థానాలను చేర్చేందుకు ఈ రైళ్లను వినియోగిస్తున్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఇటీవల విశాఖ వద్ద వందే భారత్ రైలుపై కొందరు ఆకతాయిలు రాళ్ల దాడి చేయడంతో రైలు అద్దాలు పగిలాయి. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
బీహార్ లోనూ...
ఈ ఘటనను మరువక ముందే బీహార్ లో వందే భారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. బీహార్ లోని కతిహార్ జిల్లాలోని బలరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వందేభారత్ పై రాళ్లు విసరడంతో సీ 6 బోగీ అద్దాలు దెబ్బతిన్నాయి. అయితే రైలు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినప్పటికీ ప్రయాణికులకు ఎవరికీ గాయాలు కాలేదు. ఈ పని ఎవరు చేశారన్న దానిపై రైల్వే పోలీసులతో పాటు స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story