Thu Dec 26 2024 14:03:39 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : రాష్ట్రపతిగా వెంకయ్యకు అవకాశం?
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కలిశారు. వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది
భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కలిశారు. వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఈరోజు సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిని పార్లమెంటరీ సమావేశంలో ఖరారు చేయనున్నారు.
రెండోసారి....
ఉప రాష్ట్రపతిని రాష్ట్రపతిగా చేయడం సంప్రదాయంగా వస్తుంది. వెంకయ్యనాయుడిని కలవడంతో ఆయనను మరోసారి బీజేపీ అభ్యర్థిగా ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతుంది. అందుకే అమిత్ షా, జేపీ నడ్డాలు వెంకయ్యనాయుడిని కలిశారన్న వాదనలు విన్పిస్తున్నాయి. హైదరాబాద్ లో ఈరోజు జరిగిన యోగా డే లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొని హడావిడిగా ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రపతిగా వేరొకరికి అవకాశం ఇచ్చి, వెంకయ్యకు మరోసారి ఉప రాష్ట్రపతిగా అవకాశం కల్పిస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. ఈరోజు సాయంత్రానికి రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే అవకాశాలున్నాయి.
Next Story