Fri Dec 20 2024 16:55:59 GMT+0000 (Coordinated Universal Time)
గుండెలపై రతన టాటా టాటూ... వీడియో వైరల్
రతన్ టటా ఫొటోను తన గుండెపై టాటూగా ముద్రించుకున్న ఒక యువకుడి వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణం ఎందరినో కుంగదీస్తుంది. మానసికంగా ఆయన మరణాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. భారత దేశ వ్యాప్తంగా రతన్ టాటాను అభిమానించే వారు కోట్లాది మంది ఉన్నారు. పారిశ్రామిక వేత్తగానే కాదు.. సామజిక సేవను అందిస్తూ తన ఆస్తులను సయితం దేశం కోసం ఇచ్చే రతన్ టాటాను స్మరించుకోకుండా ఉండలేకపోతున్నారు. అటువంటి రతన్ టాటా బొమ్మను తన గుండెలపై జ్ఞాపకంగా ముద్రించుకున్న ఒక వీడియో ఇప్పుడు నెట్టంట వైరల్ గా మారింది.
తన స్నేహితుడిని...
రతన్ టటా ఫొటోను తన గుండెపై టాటూగా ముద్రించుకున్న ఒక యువకుడి వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. రతన్ టాటాను తమ దేవుడిగా భావిస్తున్నట్లు వీడియోలో ఆ యువకుడు తెలిపారు. తన స్నేహితుడికి క్యాన్సర్ సోకడంతో ఖర్చు భరించలేని పరిస్థితుల్లో వైద్యం కోసం ఎంతో ఇబ్బంది పడ్డాడని, అటువంటి సమయంలో టాటా ట్రస్ట్ నుంచి సరైన సమయంలో వైద్యం అందించి తన స్నేహితుడి ప్రాణాలను నిలబెట్టిందని, అందుకే తాను రతన్ టాటా ఫొటోను గుండెలపై టాటూ వేయించుకున్నానని ఆ యువకుడు తెలిపారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.
Next Story