Sat Dec 21 2024 13:11:42 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యే ఫోన్ లాగేసుకుని.. చుక్కలు చూపించిన గ్రామస్థులు
అధ్వానమైన రోడ్లు, శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు
భాగల్పూర్: గత ఎనిమిదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన పనులపై అవగాహన కల్పించేందుకు లోక్మాన్పూర్ గ్రామాన్ని సందర్శించిన బీహార్ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శాసనసభ సభ్యుడిని గ్రామస్థులు బందీని చేశారు. ప్రభుత్వంపై కోపంతో ఉన్న అధికారులు ఎమ్మెల్యే ఇంజనీర్ కుమార్ శైలేంద్రను రెండు గంటలపాటు బందీగా ఉంచారు. ఓ పాఠశాల తరగతి గదిలో ఉంచి బయటి నుండి తాళం వేశారు. గ్రామస్థులు అతని ఫోన్ను కూడా లాక్కున్నట్లు సమాచారం.
ఎమ్మెల్యే శైలేంద్ర తన ఫేస్బుక్ పోస్ట్లో, "సింగ్పూర్ గ్రామస్తులు నన్ను అన్ని వైపుల నుండి చుట్టుముట్టారు. వరద నిర్వహణలో భాగంగా వర్క్స్ ను ప్రారంభించే వరకు నన్ను వెళ్లనివ్వబోమని చెప్పారు." అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర అసెంబ్లీలోనూ ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. వరద నిర్వహణలో భాగంగా పనులు జరుగుతున్నాయని గ్రామస్తులు చుట్టుముట్టి అడగగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరలో పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అయితే గ్రామస్తులు అతన్ని పట్టుకుని, అభివృద్ధి పనులు ప్రారంభించే వరకు వదిలిపెట్టమని చెప్పారు. ఆ గ్రామాల చుట్టుపక్కల కోసి నది కోతకు గురవుతుంది. కోసి పర్లోని లోక్మాన్పూర్, సింగ్కుండ్, బాలు తోలా, మరీచా, కహర్పూర్లో కోత నిరోధక పనులు జరగాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల కోతను అరికట్టేందుకు ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదు. దాంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికితోడు అధ్వానమైన రోడ్లు, శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది లేకపోవడంపై గ్రామస్థులు కోపాన్ని వ్యక్తం చేశారు. వారి ఆగ్రహంలో నిజముందని శైలేంద్ర కూడా ఒప్పుకున్నారు.
News Summary - Villagers allegedly hold BJP MLA hostage over delay in development works
Next Story