Sat Dec 21 2024 01:52:42 GMT+0000 (Coordinated Universal Time)
Vinesh Phogat Election Result: వినేష్ ఫోగాట్ ఎన్ని ఓట్ల తేడాతో గెలుపొందిందంటే?
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులనా స్థానం నుండి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి, రెజ్లర్ వినేష్ ఫోగట్
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులనా స్థానం నుండి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి, రెజ్లర్ వినేష్ ఫోగట్ విజయం సాధించింది. ఆమె విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేసిన యోగేష్ కుమార్పై 6,015 ఓట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నియోజకవర్గంలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD) అభ్యర్థి సురేందర్ లాథర్ మూడవ స్థానంలో నిలిచారు. కౌంటింగ్ ప్రారంభం కాగానే తొలుత ఆధిక్యంలో నిలిచిన ఫోగట్ ఒక దశలో వెనుకంజలోకి వెళ్ళింది. అయితే ఆమె తన ఆధిక్యాన్ని తిరిగి సొంతం చేసుకుంది. మంచి విజయాన్ని అందుకుంది.
2019 ఎన్నికలలో, బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డిఎ)లో భాగమైన జననాయక్ జనతా పార్టీ (జెజెపి) కి చెందిన అమర్జీత్ ధండా ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ చేతిలోకి ఈ నియోజకవర్గం వెళ్ళింది. అక్టోబర్ 5న హర్యానాలో ఒకే దశలో 67.90 శాతం ఓటింగ్ నమోదైంది. జులనాలో 74.66 శాతం ఓటింగ్ నమోదైంది. ఒలింపియన్ అయిన ఫోగట్, బీజేపీ ఎంపీ, మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్కు వ్యతిరేకంగా నిరసనలకు నాయకత్వం వహించారు. సెప్టెంబర్ 6న ఆమె కాంగ్రెస్లో చేరారు. ఇక ఆమె అధిక బరువు కారణంగా 2024 పారిస్ ఒలింపిక్స్ ఫైనల్ కు అనర్హురాలిగా ప్రకటించినప్పుడు దేశం మొత్తం షాక్ అయిన సంగతి తెలిసిందే. ఆమె అక్కడి నుండి వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో చేరడం, ఎన్నికల్లో పోటీ చేయడం, ఎమ్మెల్యేగా గెలవడం చకచకా జరిగిపోయాయి.
Next Story