Mon Dec 23 2024 04:07:39 GMT+0000 (Coordinated Universal Time)
మోటార్ సైకిల్ అనుకున్నావా.. బస్ అనుకున్నావా సామీ.. అంత మందిని ఎక్కించుకున్నావ్
ముంబైలో బైక్ పై ఏడుగురు పిల్లలతో స్కూటర్‌పై వెళుతున్న వ్యక్తికి సంబంధించిన వీడియో
ముంబైలో బైక్ పై ఏడుగురు పిల్లలతో స్కూటర్‌పై వెళుతున్న వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. మునవ్వర్ షా అనే వ్యక్తి కొబ్బరికాయల దుకాణం నడుపుతున్నాడు. అతడు బైక్ మీద అతి ప్రమాదకరంగా పిల్లలతో వెళుతున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ముంబై పోలీసులు అరెస్టు చేశారు. వీడియోలో మునవ్వర్ షా తన స్కూటర్‌పై ఇద్దరు పిల్లలను ముందు మరో ముగ్గురిని వెనుక పెట్టుకుని ఉన్నారు. మరో ఇద్దరు వాహనం పై నిలబడి ఉన్నట్లు చూడవచ్చు.
ముంబైలో ఇలాంటి ఘటనే ఒకటి కనిపించింది. ఒక వ్యక్తి తన స్కూటర్ మీద ఏడుగురితో ప్రయాణం చేశాడు. సోషల్ మీడియాలో సదరు వీడియో వైరల్ కావడంతో మునవ్వర్ షాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ వీడియోను రికార్డ్ చేసిన స్థానికుడు ట్విట్టర్లో షేర్ చేసి ముంబై పోలీసులకు ట్యాగ్ చేశాడు. వీడియోలో కనిపిస్తున్న ఏడుగురిలో నలుగురు మునవ్వర్ షా పిల్లలు కాగా, మిగిలిన వారు పొరుగువారి పిల్లలు.
Next Story