Thu Dec 19 2024 08:58:24 GMT+0000 (Coordinated Universal Time)
స్కూల్ బస్సులో బీరు తాగి విద్యార్థినుల హల్ చల్ !
తిరుకజుకుండ్రం నుంచి థాచూర్కు వెళ్తున్న విద్యార్థినులు.. స్కూల్ బస్సులో బీరు ఓపెన్ చేసి సేవించారు. ఆ సమయంలో..
చెన్నై : టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతున్న ఈ ఆధునిక యుగంలో.. ఆడ, మగ బేధం లేకుండా అమ్మాయిలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా అన్నింటా తమ ప్రతిభను చూపుతూ సమాజం గర్వపడేలా చేస్తున్నారు. మంచిలోనే కాదు.. చెడు లోనూ మేం అబ్బాయిలకేమీ తీసిపోం అనేలా.. కొందరు విద్యార్థినులు స్కూల్ బస్సులోనే బీరు తాగి హల్ చల్ చేశారు. స్కూల్ యూనిఫారమ్ లోనే విద్యార్థినులు బీరు తాగుతున్న వీడియో ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా వైరల్ అవుతోంది.
తిరుకజుకుండ్రం నుంచి థాచూర్కు వెళ్తున్న విద్యార్థినులు.. స్కూల్ బస్సులో బీరు ఓపెన్ చేసి సేవించారు. ఆ సమయంలో ఓ విద్యార్థిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసినట్లు తెలుస్తోంది. ఆ వీడియోలో విద్యార్థినీ, విద్యార్థులు కలిసి..ఓ బీర్ బాటిల్‌ను ఓపెన్ చేసి.. తాగుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. వీరంతా చెంగల్పట్టులోని ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులని తెలుస్తోంది. మొదట్లో ఇది పాత వీడియో అని అందరూ అనుకున్నారు. కానీ మంగళవారం రోజే ఇది జరిగిందని ఆ తర్వాత తెలిసింది. ఈ వీడియో జిల్లా విద్యాధికారి దృష్టికి వెళ్లడంతో.. ఆయన స్పందించారు. అధికారులు, పోలీసులు ఈ వీడియో పై ఎంక్వైరీ చేస్తున్నారని తెలిపారు. విచారణ పూర్తయ్యాక తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
Next Story