Thu Nov 21 2024 20:18:08 GMT+0000 (Coordinated Universal Time)
High Alert : అమ్మో... మళ్లీ వస్తోంది... వెంటిలేటర్లతో సహా అంతా సిద్ధం చేసుకోండి
చైనాలో మళ్లీ వైరస్ విజృంభిస్తుంది. న్యుమోనియా లక్షణాలు ఎక్కువమందిలో కనిపిస్తున్నాయి.
కరోనా వైరస్ పోయిందిలే అని అందరూ ఊపిరిపీల్చుకున్న తరుణంలో మరో భయపెట్టే వార్త మనకు కనిపిస్తుంది. చైనాలో మళ్లీ వైరస్ విజృంభిస్తుంది. న్యుమోనియా లక్షణాలు ఎక్కువమందిలో కనిపిస్తున్నాయి. ఈ వ్యాధి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్కువగా చిన్నారుల్లో ఈ వ్యాధి తలెత్తే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అన్ని రకాలుగా చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. అందరూ ముందు జాగ్రత్త చర్యగా మాస్క్లు ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరింది.
రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు...
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలతో పాటు సిబ్బంది సంఖ్యను కూడా చూసుకోవాలని కోరింది. దీంతో పాటు వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, టెస్టింగ్ కిట్లు సిద్ధం చేసుకోవాలని కోరింది. అన్ని వసతులను సమకూర్చుకుని సిద్ధంగా ఉండాలని, న్యుమోనియాను తట్టుకునేలా సకల చర్యలు చేపట్టాలని కోరింది. ఆరోగ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ వ్యాధి నిర్ధారణ చేయాలని, వెంటనే వారికి చికిత్స అందించాలని కోరింది. అప్పుడే ఈ న్యుమోనియాను నియంత్రించడానికి వీలవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Next Story