Sun Dec 22 2024 23:36:44 GMT+0000 (Coordinated Universal Time)
Nipah virus : కేరళను కుదిపేస్తున్న నిఫా వైరస్... అంటుకుందంటే?
కేరళ రాష్ట్రాన్ని వైరస్ లు వదిలిపెట్టడం లేదు. తాజాగా నిఫా వైరస్ తో కేరళ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
కేరళ రాష్ట్రాన్ని వైరస్ లు వదిలిపెట్టడం లేదు. తాజాగా నిఫా వైరస్ తో కేరళ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నిఫా వైరస్ తో కొందరు మృత్యువాత పడుతుండటంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలను చేపట్టింది. మాస్క్ లను తప్పనిసరి చేస్తూ కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మలప్పురం జిల్లాల్లో ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అక్కడ మాస్క్‌లను ధరించడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
మరణంతో...
నిఫా వైరస్ నిన్న 23 ఏళ్ల వ్యక్తి మరణించడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమయింది. మృతుడితో సన్నిహితంగా మెలిగిన వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించి వారి రక్త నమూనాలను పూనేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపారు. తిరువలి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో సినిమా హాళ్లు, విద్యాసంస్థలను మూసివేశారు. ప్రజలు భౌతిక దూరం పాటించాలని, విధిగా మాస్క్ లను ధరిస్తూ శానిటైజర్లను వాడాలంటూ ప్రభుత్వం పెద్దయెత్తున ప్రచారం ప్రారంభించింది. సాఫ్ట్వేర్ సంస్థలు కూడా వర్క్ ఫ్రం హోంను ప్రకటించాయి.
వేగంగా విస్తరించే...
నిఫా వైరస్ గబ్బిలాలతో పాటు కుక్కలు, మేకలు, పందుల వంటి వాటితో సోకే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. వైరస్ సోకిన వ్యక్తి నుంచి ఇతరులకు కూడా సులభంగా సోకే అవకాశముండటంతో కేరళ సర్కార్ అలెర్ట్ అయింది. నిఫా వైరస్ ప్రభావంతో పర్యాటక రంగంపై పడే అవకాశముండటంతో టూరిజం ప్లేస్‌లలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక్కడ హోటళ్లు, రిసార్టులు తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశాలను జారీచేసింది. మొత్తం మీద కేరళలో ఉన్న నిఫా వైరస్ తో పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి.
Next Story