మీ వద్ద ఓటర్ ఐడీ కార్డ్ లేదా.? ఆన్లైన్లో డౌన్లోడ్ చేయండిలా!
ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలస సందడి కొనసాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే..
ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలస సందడి కొనసాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇప్పటికే కొన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించగా, మరికొన్ని పార్టీలు విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక తెలంగాణ సహా 5 రాష్ట్రాలల్లో కూడా ఎన్నికలు జరుగనున్నాయి.
ఈ నేపథ్యంలో ఓటర్ ఐడీ కార్డుకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఇంట్లో ఉండి ఆన్లైన్లో డిజిటల్ ఓటర్ కార్డును పొందే అవకాశం కల్పించింది. సాధారణంగా ఎన్నికల కమిషన్ నుంచి ఓటర్ ఐటీ పోస్టు ద్వారా ఇంటికి వస్తుంది. లేదంటే ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఓటర్ ఐడీ కార్డు అన్ని ధ్రువపత్రాల మాదిరిగానే ఉపయోగించుకోవచ్చు. అలాగే ఓటు వేసే సమయంలో కూడా చూపించుకోవచ్చు. ఇంతకీ ఆన్లైన్లో ఓటర్ ఐడీని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం.
☛ ముందుగా నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ http://voters.eci.gov.in లోకి వెళ్లాలి.
☛ తర్వాత పేర్కొన్న వివరాలను అందించాలి.
☛ వెంటనే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
☛ ఈ పేజీలో మీ రిజిస్టర్ మొబైల్ లేదా ఈ మెయిల్ ఐడీ, లేదా ఈపిక్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి.
☛ లాగిన్ సమయంలో ఎంచుకున్న పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి.
☛ చివరిగా అక్కడ ఉన్న క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసిన రిక్వెస్ట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
☛ తర్వాత వెంటనే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వెళ్తుంది.
☛ ఓటీపీని నిర్దేశించిన బాక్స్‌లో ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కాలి.
☛ తర్వాత డిజిటల్ ఓటర్ ఐడీ కార్డును డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు ‘డౌన్లోడ్ ఈపిక్’పై క్లిక్ చేయాలి.
☛ ఆ తర్వాత పీడీఎఫ్ ఫార్మాట్లో ఓటర్ ఐడీ డౌన్లోడ్ అవుతుంది.
☛ డౌన్లోడ్ చేసుకున్న ఓటర్ ఐడీని కలర్ ప్రింట్ తీసుకొని లామినేషన్ చేయించుకుంటే సరిపోతుంది. ఓటు వేసే సమయంలో కూడా దీనిని చూపించి ఓటు వేసుకోవచ్చు.
ఓటర్ ఐడీ లేకపోతే..
ఒకవేళ ఓటర్ గుర్తింపు లేని సమయంలో కూడా ఓటు వేయవచ్చు. మీ సంబంధిత పోలింగ్ స్టేషన్లో మీపేరు ఉంటే చాలు. ప్రత్యామ్నాయం ధృవీకరణ పత్రాలు చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, బ్యాంకు/పోస్ట్ ఆఫీస్ జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్ బుక్ ను చూపించి ఓటు వేయవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఇక డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్ పోర్ట్ చూపించి కూడా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.