Mon Dec 23 2024 15:58:09 GMT+0000 (Coordinated Universal Time)
సీఎం వర్సెస్ గవర్నర్... దీదీకి షాక్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి, ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ ఖడ్ కు మధ్య మళ్లీ యుద్ధం మొదలయింది
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి, ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ ఖడ్ కు మధ్య మళ్లీ యుద్ధం మొదలయింది. గవర్నర్ మమత బెనర్జీ ప్రభుత్వంపై 167 అధికరణాన్ని ఉపయోగించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పెగాసస్ స్పైవేర్ కు సంబంధించిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన దర్యాప్తు కమిటీ, నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలను తనకు పంపాలని గవర్నర్ కోరారు.
సమాచారం ...
167 అధికరణ ప్రకారం రాష్ట్ర గవర్నర్ కోరిన సమాచారాన్ని ముఖ్యమంత్రి ఖచ్చితంగా పంపాల్సి ఉంటుంది. పెగాసస్ ఆరోపణలకు సంబంధించి దర్యాప్తు కమిటీ విషయంలో తనను సంప్రదించలేదని గవర్నర్ ఆక్షేపిస్తున్నారు. చీఫ్ సెక్రటరీ సయితం ఈ విషయంలో విఫలమయ్యారని గవర్నర్ భావిస్తున్నారు. ఇందుకోసం మమతపై 167 అధికరణ ను ప్రయోగించక తప్పలేదని ఆయన తెలిపారు.
Next Story