Mon Dec 23 2024 17:01:49 GMT+0000 (Coordinated Universal Time)
మన్ కీ బాత్ లో దేశ ప్రజలకు ప్రధాని కరోనా సూచనలు
భారత్ లో కేంద్రం ముందస్తు జాగ్రత్త చర్యలను తీవ్రతరం చేసింది. ప్రజలు వైరస్ నుండి సురక్షితంగా ఉండేలా..
పొరుగుదేశమైన చైనాలో కరోనా కేసులు కుప్పలు తెప్పలుగా పెరిగిపోతుండటంతో.. ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. చైనాతో పాటు జపాన్, అమెరికా దేశాల్లోనూ కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. BF7 అనే న్యూ వేరియంట్ కరోనా ప్రళయానికి ప్రధాన కారణంగా గుర్తించారు. చైనాలో కేసులు పెరగడంతో.. భారత్ లో కేంద్రం ముందస్తు జాగ్రత్త చర్యలను తీవ్రతరం చేసింది. ప్రజలు వైరస్ నుండి సురక్షితంగా ఉండేలా.. నివారణ చర్యలు పాటించాలని ప్రధాని మోదీ కోరారు. నేడు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని.. కరోనా పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్త చర్యలను సూచించారు. ''చాలా దేశాల్లో కరోనా కేసులు పెరిగిపోతుండడాన్ని చూస్తున్నాం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మాస్క్ లు ధరించి, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి''అని ప్రధాని తెలిపారు.
మంగళవారం (డిసెంబర్ 27) నుండి ఆరోగ్య సదుపాయాల సన్నద్ధతను తెలుసుకునేందుకు మాక్ డ్రిల్స్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది. ఒక్కసారిగా కేసులు పెరిగితే.. పేషంట్స్ కు చికిత్స అందించేందుకు వీలుగా సదుపాయాలను సిద్ధం చేసుకోవాలని సూచించింది. అలాగే ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, లైఫ్ సపోర్ట్ యంత్రాల పనితీరును చెక్ చేసుకోవాలని కోరింది. అన్ని ఎయిర్ పోర్టుల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలను తప్పనిసరి చేసింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయంలో కరోనా నిర్థారణ పరీక్షలను నిర్వహిస్తోంది.
Next Story