Mon Dec 23 2024 10:31:36 GMT+0000 (Coordinated Universal Time)
Delhi : ఢిల్లీ లో కొనసాగుతున్న నీటి కొరత
ేదేశ రాజధాని ఢిల్లీలో నీటి సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అనేక ప్రాంతాల్లో నీటి కొరత ఇంకా తీరలేదు
దేశ రాజధాని ఢిల్లీలో నీటి సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అనేక ప్రాంతాల్లో నీటి కొరత ఇంకా తీరలేదు. దీంతో ఢిల్లీ వాసులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో గతంలో ఎన్నడూ లేని విధంగా గత కొద్ది రోజుల నుంచి నీటి సంక్షోభం నెలకొంది. పైపులైన్ల నుంచి నీరు రాకపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. పైపులైన్లను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పగులుగొడుతుండటంతో పోలీసు సిబ్బందిని వాటికి రక్షణగా నియమించారు.
ట్యాంకర్ వచ్చిందంటే...
ట్యాంకర్ వచ్చిందంటే చాలు ఒక్కసారిగా జనం మూగుతున్నారు. బిందెడు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఒక్క బిందె నీరు దొరికినా చాలునన్న ఉద్దేశ్యంతో ట్యాంకర్ల వద్ద క్యూ కడుతున్నారు. ఈ సందర్భంగా ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. పైపులైన్ల వద్ద పోలీసులు పెట్రోలింగ్ ను నిర్వహిస్తున్నారు. ట్యాంకర్ వచ్చిందంటే చాాలు ఘర్షణలు చోటు చేసుకోవడంతో అక్కడ కూడా పోలీసులు భద్రతగా ఉండి ఒక్కొక్కరికి ఒక బిందె చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించారు.
Next Story