Sun Dec 22 2024 19:06:16 GMT+0000 (Coordinated Universal Time)
Weather Update పొంచి ఉన్న అల్ప పీడనం.. ఏపీకి ముప్పు ఉందా?
దీని ప్రభావంతో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం
బంగ్లాదేశ్ పరిసరాల్లో ఉపరితల అవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బంగ్లాదేశ్, సమీప ప్రాంతాలపై కొత్త అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుందని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వీచింది. దీంతో ఒడిశాలో శుక్రవారం నుండి ఆదివారం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగ్లాదేశ్, దాని పరిసర ప్రాంతాలలో ఉన్న పరిస్థితుల కారణంగా రాబోయే 24 గంటల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడటానికి దారితీసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. సెప్టెంబర్ 15న పశ్చిమ బెంగాల్కు ఆనుకుని బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందని భావిస్తున్నారు. అయితే దీని ప్రభావం ఏపీపై ఉండదని అంటున్నారు. ఈ సమయంలో మత్స్యకారులు ఉత్తర బంగాళాఖాతం, ఒడిశా తీరం వెలుపల ఉన్న జలాల్లోకి వెళ్లవద్దని సూచించారు.
నైరుతి రుతుపవనాల తిరోగమనం:
ఈ నెల 19 నుంచి 25 మధ్య నైరుతి రుతుపవనాలు దేశం నుంచి తిరోగమించే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ ప్రారంభంలో కేరళను తాకుతాయి. జూలై నెలలో దేశవ్యాప్తంగా విస్తరిస్తుంటాయి. సెప్టెంబర్ నాటికి వాయువ్య భారతం నుంచి ఉప సంహరణ ప్రారంభమవుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 17 నుంచి తిరుగోమనం మొదలై అక్టోబర్ 15 నాటికి తిరుగుముఖం పడుతాయని అంచనా వేస్తున్నారు.

Next Story