School Holidays: తీవ్రమైన చలి.. స్కూల్స్ కు సెలవులు
భారతదేశంలో కొనసాగుతున్న చలిగాలుల నేపథ్యంలో నోయిడాలోని పాఠశాలలు విద్యార్థులకు సెలవులు
ఉత్తర భారతదేశంలో కొనసాగుతున్న చలిగాలుల నేపథ్యంలో నోయిడాలోని పాఠశాలలు విద్యార్థులకు సెలవులు ప్రకటించాయి. 8వ తరగతి వరకు విద్యార్థులకు జనవరి 3 నుండి 6 వరకు పాఠశాలలను మూసివేయనున్నారు. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు మాత్రమే తరగతులు కొనసాగుతాయని గౌతమ్బుద్ధ్నగర్ జిల్లా యంత్రాంగం మంగళవారం ప్రకటించింది. చలి వాతావరణం కారణంగా డిసెంబర్ 29, 30 తేదీల్లో నగరంలోని అన్ని తరగతులకు పాఠశాలలు మూసి వేశారు. డిసెంబర్ చివరి వారంలో ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్ కు పడిపోయిన సంగతి తెలిసిందే. చాలా మంది పిల్లలు బయటకు రావడానికి కూడా భయపడ్డారు. తీవ్రమైన చలి, పొగమంచు కారణంగా వారణాసిలో ఇప్పటికే జనవరి 6 వరకు స్కూళ్లకు సెలవు ప్రకటించగా.. తాజాగా లక్నో జిల్లాలో కూడా స్కూళ్లను మూసేశారు. ఒకటి నుంచి 8వ తరగతి చదివే పిల్లలకు ఈ నెల 6 వరకు సెలవులు ప్రకటించారు. 9 నుంచి 12 వరకు చదువుతున్న పిల్లలకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తరగతులు బోధించనున్నారు.