Mon Dec 23 2024 02:49:27 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్లిళ్ల సీజన్ మొదలయింది
దేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలయంది. ఈ నెల 4వ తేదీ నుంచి వివాహాలు జరగడం ప్రారంభమయ్యాయి
దేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలయంది. ఈ నెల 4వ తేదీ నుంచి వివాహాలు జరగడం ప్రారంభమయ్యాయి. దేశ వ్యాప్తంగా ఈ నెల 4 నుంచి వచ్చే నెల 14 వరకూ మంచి ముహూర్తాలు ఉన్నాయని చెప్పడంతో వివాహాల సంఖ్య పెరిగింది. కేవలం 41 రోజుల్లోనే 32 లక్షల వివాహాలు జరగనున్నాయి. దీనివల్ల వ్యాపారాలు రెండు వందల శాతం పెరిగే అవకాశముందని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య అంచనా వేసింది.
32 లక్షల వివాహాలు...
కొంత గ్యాప్ తర్వాత వివాహాల ముహూర్తాలు ఉండటంతో అత్యధికంగా పెళ్లిళ్లు జరుగుతున్నాయని పండితులు కూడా చెబుతున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా వివాహాలు పెద్దగా జరగడం లేదు. జరిగినా వ్యాపారాలు లేవు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల నుంచి కుదుట పటడంతో వ్యాపారాలు మరింత పెరిగే అవకాశముందని ఆ సంస్థ అంచనా వేస్తుంది.
లక్షల కోట్ల వ్యాపారం...
ఒక్క ఢిల్లీ పరిధిలోనే 3.5 లక్షల వివాహాలు ఈ 41 రోజుల్లో జరుగుతాయని అంచనా ఉంది. ఈ పెళ్లిళ్ల ద్వారా 75 వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని, రాజస్థాన్ లో 1.5 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని భావిస్తున్నారు. ఈ సీజన్ లో పెళ్లిళ్ల ద్వారా 3.75 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కలు ఆసక్తికరంగా ఉన్నప్పటికీ ఇది వాస్తవమేనని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
Next Story