Sun Dec 22 2024 23:45:20 GMT+0000 (Coordinated Universal Time)
Wedding Season : మూడు నెలలు ఇక సన్నాయి మేళాల మోత.. పెళ్లిళ్లే పెళ్లిళ్లు...తలంబ్రాలు.. పెళ్లికాని ప్రసాద్‌లకు పండగే
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. మరో మూడు రోజుల్లో మాఘమాసం ప్రారంభం కానుండటంతో పెళ్లిళ్ల సీజన్ వచ్చినట్లే
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. మరో మూడు రోజుల్లో మాఘమాసం ప్రారంభం కానుండటంతో పెళ్లిళ్ల సీజన్ వచ్చినట్లే. ఇక పెళ్లిళ్ల ముహూర్తాలు కూడా ఇప్పటికే ఫిక్స్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి నెలకొంటుంది. ఇప్పటికే ఫంక్షన్ హాళ్లన్నీ బుక్ అయిపోయాయి. క్యాటరింగ్ కూడా అడ్వాన్స్‌లు ఇచ్చేసి ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. పురోహితులు పెట్టిన మంచి ముహూర్తానికి తలంబ్రాలు పడేలా పెళ్లి కాని ప్రసాదులు సిద్ధమయిపోయారు.
వేల సంఖ్యలో పెళ్లిళ్లు...
వరస ముహూర్తాలు ఉండటంతో అన్నింటికీ డిమాండ్ పెరిగింది. ధరలు కూడా విపరీతంగా పెంచేశారు. ఫంక్షన్ హాలు స్థాయిని బట్టి లక్షల్లో పలుకుతుంది. క్యాటరింగ్ కూడా శాఖాహార భోజనం ప్లేట్ ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు. మంగళవాయిద్యాలు, పూలు, డెకరేషన్ ఇలా అన్ని రేట్లు విపరీతంగా పెరిగాాయి. అయినా పెళ్లి కావడంతో అప్పులు చేసి మరీ పెళ్లికి సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మూడు నెలల కాలంలో వేలాది జంటలు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కటి కానున్నాయి.
మంచి ముహూర్తాలు....
ఈ నెల 11వ తేదీ నుంచి మాఘమాసం ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 13,14,17,18,24,28,29 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి. ఫిబ్రవరి 13, 14 మంచి ముహూర్తాలు కావడంతో ఆరోజు అధిక సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఈ ముహూర్తాల్లో వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఇక మార్చి 2, 3 తేదీలు కూడా పెళ్లిళ్లకు అనువైన ముహూర్తాలుగా పండితులు నిర్ణయించారు. తర్వాత ఫాల్గుణ మాసం ప్రారంభం కానుంది. మార్చి 15,17,20,22,24,25,27,28,30 లలో శుభముహూర్తాలున్నాయి. అలాగే ఏప్రిల్ నెలలో ఛైత్ర మాసం ప్రారంభం కానుంది. ఏప్రిల్ 9, 18,19,20,21,22,24,26 వరకూ మంచి ముహూర్తాలున్నాయి. ఏప్రిల్ 28వ తేదీ నుంచి మూఢం ప్రారంభం కానుంది.
Next Story