Mon Dec 23 2024 02:04:21 GMT+0000 (Coordinated Universal Time)
మమత లేఖ.. ఇప్పుడు ఏకం కాకపోతే?
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ విపక్ష నేతలకు, బీజేపీయేతర ముఖ్యమంత్రులకు లేఖ రాశారు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ విపక్ష నేతలకు, బీజేపీయేతర ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ ఏకమవ్వాలని ఆమె పిలుపు నిచ్చారు. ప్రజాస్వామ్యం పై బీజేపీ ప్రత్యక్ష దాడులకు దిగుతుందని మమత బెనర్జీ ఆరోపించారు. బీజేపీ కి వ్యతిరేకంగా వ్యూహాలను రచించడం కోసం సమావేశమవ్వాలని ఆమె పిలుపునిచ్చారు. దేశం కోరుకునే విధంగా కూటమి ఏర్పడాలని మమత ఆకాంక్షించారు.
అందరం ఏకమయితేనే?
బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమయితేనే ఎదుర్కొనగలమని మమత బెనర్జీ అభిప్రాయపడ్డారు. సీబీఐ, ఈడీ, సీవీసీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్ష పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ దాడులు చేయిస్తుందని మమత బెనర్జీ ఆరోపించారు. ఐక్యంగా విలువలతో కూడిన ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేసే దిశగా అందరం కలసి నడవాలని మమత బెనర్జీ పిలుపునిచ్చారు.
Next Story