Sun Dec 22 2024 14:13:18 GMT+0000 (Coordinated Universal Time)
ఐఫోన్ కోసం కన్నబిడ్డనే అమ్మేసిన తల్లిదండ్రులు
మామూలు ఫోన్ కంటే.. ఐ ఫోన్ ఉంటే ఆ రేంజే వేరు. చాలామంది చిన్న, మధ్యతరగతి వారికి ఐ ఫోన్ ఒక కల. దానిని కొనే ధరతో
మనుషులను ప్రేమించాలి.. వస్తువులను వాడుకోవాలి.. కానీ టెక్నాలజీ వెంట పరిగెడుతూ.. లగ్జరీలకు అలవాటు పడి మనమంతా వస్తువులను ప్రేమిస్తూ.. మనుషులను వాడుకుంటున్నాం. టిక్ టాక్ తో మొదలైన రీల్స్ పిచ్చి.. ఆ యాప్ ను కొన్నికారణాలతో మనదేశంలో బ్యాన్ చేసినా.. ఇన్ స్టా, ఇతరత్రా రీల్స్ యాప్ లతో కొనసాగుతూనే ఉంది. రీల్స్ కోసం తమ ప్రాణాల్నే కాదు.. పక్కోడి ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు వెనుకాడని పరిస్థితికి చేరుకుంటున్నారంటూ రీల్స్ మోజు ఎంతలా ముదిరిపోయిందో చూడండి.
మామూలు ఫోన్ కంటే.. ఐ ఫోన్ ఉంటే ఆ రేంజే వేరు. చాలామంది చిన్న, మధ్యతరగతి వారికి ఐ ఫోన్ ఒక కల. దానిని కొనే ధరతో నలుగురు మనుషులుండే ఒక కుటుంబం ఆరునెలలు మూడుపూటలా కడుపునిండా తినొచ్చు. అయితే కొందరు ఆ ఫోన్ కొనుక్కునేందుకు కష్టపడితే.. కొందరు మాత్రం ఈజీగా ఎలా పొందాలా అని ఆలోచిస్తుంటారు. ఓ దంపతులైతే.. తమ కన్నబిడ్డకంటే రీల్స్ చేసేందుకు ఐ ఫోనే ముఖ్యం అనుకున్నారు. అంగట్లో బొమ్మను అమ్మినట్టు తమ కన్నబిడ్డనే అమ్మేశారు. సభ్యసమాజం వినడానికే సిగ్గుపడే ఈ ఉదంతం పశ్చిమ బెంగాల్ లో వెలుగుచూసింది.
ఉత్తర 24 పరగణాల జిల్లా పానిహతిలోని గాంధీనగర్ లో జయదేవ్, సాథీ దంపతులు తమ ఎనిమిది నెలల మగబిడ్డతో నివసిస్తున్నారు. వీరికి సోషల్ మీడియాలో రీల్స్ చేసి.. పాపులర్ అవ్వాలని కోరిక. వివిధ ప్రాంతాలకు వెళ్తూ రీల్స్ చేసి ఇన్ స్టా లో పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఐ ఫోన్ ఉంటే రీల్స్ ఇంకా బాగా వస్తాయనుకున్నారు. కానీ ఐఫోన్ కొనుక్కునే స్తోమత లేదు. వెంటనే తమ బిడ్డను అమ్మి ఫోన్ కొనాలనుకున్నారు. అంతే.. 8 నెలల మగబిడ్డను బేరానికి పెట్టి.. మంచి ధరకు అమ్మేసి.. చక్కగా షాపుకెళ్లి ఐఫోన్ కొనుక్కున్నారు.
ఆ దంపతులతో పాటు ఉండాల్సిన బిడ్డ కనిపించకపోవడంతో.. ఇరుగుపొరుగువారికి అనుమానం వచ్చింది. బిడ్డ ఏమయ్యాడని అడిగితే.. అమ్మేసి ఐఫోన్ కొని రీల్స్ చేస్తున్నామని బదులిచ్చారు. ఆ సమాధానం విన్నవారందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా.. వారు దంపతులను ప్రశ్నించారు. పోలీసులకు కూడా నిస్సంకోచంగా ఇదే మాట చెప్పారు. ఇలా చెప్పడానికి సిగ్గులేదా ? అని అడిగితే.. తాము సిగ్గుపడే పనిచేయలేదని చెప్పడంతో షాకవ్వడం పోలీసుల వంతైంది. ఆ దంపతులను అదుపులోకి తీసుకుని బిడ్డను ఎవరికి, ఎప్పుడు, ఎంతకు అమ్మారన్న వివరాలు తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నారు.
Next Story