Mon Dec 23 2024 06:53:33 GMT+0000 (Coordinated Universal Time)
రేపటి నుంచి విద్యాసంస్థలు బంద్... కరోనా ఎఫెక్ట్
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలను మూసివేయాలని నిర్ణయించింది
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలను మూసివేయాలని నిర్ణయించింది. కరోనా తీవ్రతను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు అన్ని మాల్స్, సెలూన్లు, స్పాలు, జూ పార్క్ లు, బ్యూటీపార్లర్లను మూసివేశారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో...
ప్రభుత్వ కార్యాలయాల్లో యాబై శాతం మంది పనిచేయడానికే అనుమతి ఇచ్చారు. ఇక లోకల్ రైళ్లలోనూ యాభై ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చారు. కోల్్ కత్తా నుంచి ముంబయి, ఢిల్లీకి పరిమిత సంఖ్యలోనే విమానసర్వీసులు నడుపుతున్నారు. వారానికి ఒకసారి మాత్రమే విమాన సర్వీసులున్నాయి. కరోనా కట్టడికి మరిన్ని కఠినమైన చర్యలు తీసుకుంటామని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తెలిపింది.
Next Story