Sat Apr 05 2025 06:43:31 GMT+0000 (Coordinated Universal Time)
వాట్సప్ సేవలకు అంతరాయం
వాట్సప్ సర్వీసులకు దేశ వ్యాప్తంగా అంతరాయం కలిగింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో యూజర్లు ఈ ఇబ్బంది పడుతున్నారు

వాట్సప్ సర్వీసులకు దేశ వ్యాప్తంగా అంతరాయం జరిగింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో దేశ వ్యాప్తంగా యూజర్లు ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. వాట్సప్ ఓపెన్ కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మెసేజ్ వెళ్లిందా? లేదా? అన్న దానిపై యూజర్లకు అనుమానం కలుగుతుంది.
యూజర్లకు ఇబ్బంది...
దీంతో వాట్సప్ యూజర్లు దేశ వ్యాప్తంగా ఇబ్బంది పడుతున్నారు. దాదాపు అరగంట సేపటి నుంచి వాట్సప్ సేవలు నిలిచిపోయాయని తెలుస్తోంది. ఎక్కడ సాంకేతిక సమస్య తలెత్తిందన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. వాట్సప్ యాజమాన్యం మాత్రం ఇంకా దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Next Story