Mon Nov 18 2024 15:02:04 GMT+0000 (Coordinated Universal Time)
స్థిరంగా బంగారం..బాగా తగ్గిన వెండి
దేశంలో నేడు బంగారం ధరలు స్థిరంగా ఉండగా, వెండి ధరలు మాత్రం తగ్గాయి. ఇది పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి
బంగారం అంటేనే దూరమయిన వస్తువుగా పేద, మధ్య తరగతి ప్రజలు ఒకప్పుడు భావించే వారు. కొనుగోలు చేయలేమని అనుకునే వారు. కానీ ఇప్పుడు బంగారం కొనుగోలు చేయడం సులభంగా మారింది. జ్యుయలరీ షాపులు అమలు చేస్తున్న స్కీమ్ లతో పాటు, ఈఎంఐలు అందుబాటులో ఉండటంతో బంగారం కొనుగోలు చేయడం సులభతరంగా మారింది. బంగారం అంటే ఇష్పపడే భారతీయ మహిళలు ఎలాగైనా ఆ వస్తువును తన ఇంటికి తెచ్చుకోవాలని భావిస్తారు. అలాగని ఎక్కువ మొత్తంలో వెచ్చించకపోయినా స్కీమ్ లు కట్టి మరీ సొంతం చేసుకుంటున్నారు. బంగారానికి ఉన్న డిమాండ్ కూడా బాగా పెరిగింది. అందుకే ప్రతి గల్లీలో ఒక జ్యుయలరీ షాపు వెలిశాయి. ఇక కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకకులు బంగారం ధరలపై నిత్యం ప్రభావం చూపుతుంటాయి.
భారీగా తగ్గిన వెండి
బంగారం తగ్గినప్పుడే కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు ఎప్పటికప్పుడు సూచిస్తుంటారు. అయితే దేశంలో నేడు బంగారం ధరలు స్థిరంగా ఉండగా, వెండి ధరలు మాత్రం తగ్గాయి. ఇది పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,250 రూపాయలు ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,900 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర బాగా తగ్గింది. కిలో వెండిపై రూ.2400లు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి హైదరాబాద్ మార్కెట్ లో 62,400 రూపాయలుగా కొనసాగుతుంది.
Next Story