Wed Nov 20 2024 17:37:44 GMT+0000 (Coordinated Universal Time)
గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం ధరలు
దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా, వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి.
బంగారం అంటే మోజు పడని వారు ఉండరు. ముద్దొచ్చినప్పుడే చంకనెక్కాలన్న సామెతగా బంగారం ధర దిగివచ్చినప్పుడే కొనుగోలు చేయాలి. బంగారాన్ని కేవలం ఆభరణాలుగా మాత్రమే కాదు పెట్టుబడిగా చూసేవారు ఎక్కువ అవుతుండటంతో బంగారంకు భారీగా డిమాండ్ పెరుగుతుంది. బంగారం ధర పెద్దగా తగ్గదు. అదే పెరిగితే భారీగానే పెరుగుతుందన్న అంచనాలతో ఎక్కువ మంది కొనుగోలు చేసి బంగారాన్ని పెట్టుబడిగా పెట్టుకుంటున్నారు.
వెండి మాత్రం...
దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా, వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,100 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,200 రూపాయలుగా ఉంది. వెండి ధర స్వల్పంగా తగ్గింది. కిలోకి వందరూపాయలు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర 65,000 రూపాయలుగా ఉంది.
Next Story