బంగారం కొనుగోలు దారులు ఈరోజు?
దేశంలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉండగా, హైదరాబాద్ లో మాత్రం పెరిగాయి. 24 క్యారెట్ల పది గ్రాముల పై రూ.880లు పెరిగింది
భారతీయులకు బంగారం అంటేనే మహా ప్రీతి. బంగారాన్ని తమ పరువును నిలిపే వస్తువుగా భావిస్తారు. ప్రతి ఇంట్లో బంగారం లేనిదే ఏ శుభకార్యమూ జరగని పరిస్థిితి. అయితే ఇటీవల పెరుగుతున్న ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలకు బంగారం అందుబాటులో లేకుండా పోయింది. ఆభరణాలను ఇష్టపడే అతివలు తాము కూడబెట్టిన మొత్తంతో కొనుగోలు చేయడానికి సరిపడా బంగారు ఆభరణాలు లభించడం లేదు. అందుకే ఇప్పుడు జ్యుయలరీ షాపులు కూడా స్కీమ్ లను ప్రవేశపెట్టి వారిని బంగారానికి దూరం కాకుండా చేస్తున్నాయి. కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చేర్పులు జరుగుతుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. అయినా బంగారం పెరిగితే భారీగా, తగ్గితే స్వల్పంగా ఉండటం ఎప్పుడూ జరిగేదే. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.