Fri Dec 27 2024 00:11:36 GMT+0000 (Coordinated Universal Time)
రాహుల్ జోడో యాత్రలో ఉండగానే.. కాంగ్రెస్ కు షాక్
రాహుల్ యాత్రచేస్తుండగానే కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలింది. గోవాలో 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరుపుతున్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ చేస్తున్న ఈ యాత్రతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని అందరూ భావించారు. నేతల నుంచి క్యాడర్ వరకూ ఈ యాత్ర జోష్ నింపుతుందని అధినాయకత్వం కూడా ఆశించింది. కానీ జోడో యాత్ర జరుగుతుండగానే కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గోవాలో 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు.
8 మంది ఎమ్మెల్యేలు జంప్...
గోవాలో మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ఎనిమిది మంది బీజేపీలో చేరడంతో ముచ్చటగా ముగ్గురు మాత్రమే పార్టీలో మిగిలారు. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకే అధికార పార్టీలో చేరామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గోవాలో ఎప్పుడు ఎవరు గెలిచినా వారు పార్టీని వీడటం సాధారణమయిపోయింది. గతంలోనూ పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు.
Next Story