Sun Dec 22 2024 22:46:57 GMT+0000 (Coordinated Universal Time)
కుక్కపిల్లను హింసించిన జంట.. వీరిలో జంతువెవరంటూ ఐఏఎస్ అధికారి ట్వీట్
ఆ పక్కనే ఉన్న గోడపై కోతులకు కుక్కపిల్లను చూపి.. వాటిని భయపెట్టే ప్రయత్నం చేశారు. ఈ వీడియో చూశాక వీరిలో మనిషి ఎవరు?
ఒక ఐఏఎస్ అధికారి చేసిన ట్వీట్.. నెటిజన్లను ఆలోచనలో పడేసింది. ఆ ట్వీట్ లో ఆయన ఒక వీడియోను జతపరిచారు. ఐఏఎస్ అధికారి శరణ్.. షేర్ చేసిన ఆ వీడియోలో.. జంతువు ఎవరు ? అని ప్రశ్నించారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అనుకుంటున్నారా ? ఓ అమ్మాయి, ఓ యువకుడు కుక్కపిల్ల కాళ్లను చెరోవైపు పట్టుకుని అటు ఇటూ ఊపుతూ.. గాల్లోకి ఎగురవేస్తూ.. బొమ్మలా గిరగిరా తిప్పుతూ కేరింతలు కొట్టారు. పాపం దానికి ఎంత నొప్పేసి ఉంటుందో. పైగా ఆ యువకుడు దాని కాళ్లను పట్టుకుని వేలాడదీస్తూ.. గాలిలోకి తిప్పుతూ వికృతానందాన్ని పొందాడు.
ఆ పక్కనే ఉన్న గోడపై కోతులకు కుక్కపిల్లను చూపి.. వాటిని భయపెట్టే ప్రయత్నం చేశారు. ఈ వీడియో చూశాక వీరిలో మనిషి ఎవరు? జంతువు ఎవరో? చెప్పాలని శరణ్ ఆవేదనగా ప్రశ్నించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ యువతి, యువకుడితో పాటు.. వీడియో తీసిన వ్యక్తిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురినీ అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. కామెంట్లు చేస్తున్నారు. మొత్తం ముగ్గురూ జంతువులేనని, తన ఎదురుగా కనుక ఇలా చేసి ఉంటే వారి మూతి పగలగొట్టి ఉండే వాడినని ఓ యూజర్ కామెంట్ చేశాడు.
Next Story