Michaung: బీభత్సం సృష్టిస్తున్న 'మిచౌంగ్' తుఫాకు పేరు ఎవరు పెట్టారు..?
Michaung Cyclones: ప్రస్తుతం మిచౌంగ్ తుఫాను భయపెడుతోంది. బంగాళాఖాతంలో మిచౌంగ్ తుఫాను తీవ్ర తుపానుగా బలపడింది..
Michaung Cyclones: ప్రస్తుతం మిచౌంగ్ తుఫాను భయపెడుతోంది. బంగాళాఖాతంలో మిచౌంగ్ తుఫాను తీవ్ర తుపానుగా బలపడింది. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను తీవ్ర బీభత్సం సృష్టిస్తుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. అయితే ప్రస్తుతం ఈ తుఫానుకు మిచౌంగ్ తుఫానుగా నామకరణం చేశారు. ఈ తుఫానుకు పేరు మయన్మార్ పెట్టినట్లు సమాచారం.ఇది బలం, స్థితిస్థాపకతను సూచిస్తుంది. ఇది ఏర్పడిన తర్వాత, మిచౌంగ్ తుఫాను బంగాళాఖాతంలో నాల్గవ తుఫానుగా, 2023లో హిందూ మహాసముద్రంలో ఏర్పడే ఆరవ తుఫానుగా మారనుంది.
మయన్మార్ ప్రతిపాదించిన 'మిచౌంగ్' అనే పదం బలం, స్థితిస్థాపకతను సూచిస్తుంది. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ప్రతి ఉష్ణమండల తుఫాను బేసిన్‌కు కేటాయించిన భ్రమణ పేర్ల జాబితాలను నిర్వహించడానికి బాధ్యత వహిస్తుంది.
2021 లో ఏర్పడిన తౌటే తుఫాన్ కి కూడా మయన్మార్ పేరు పెట్టింది. మయన్మార్ లో తౌటే అంటే పెద్ద శబ్ధం చేసే బల్లి అని అర్థం. ఈ తుఫాన్ భారీ శబ్ధాలు చేస్తూ రావడంతో మయన్మార్ వాతావరణ శాఖ తమ దేశంలో ప్రత్యేకంగా ఉండే బల్లి పేరును పెట్టింది. ఆ తర్వాత ఏపీని వణికించిన హుద్ హుద్ తుఫాన్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ దీని ఎఫెక్ట్ ఆ ప్రాంతంలో కనిపిస్తూనే ఉంది. హుద్ హుద్ తుఫాన్ కి ఆ పేరు ఒమన్ సూచించింది. ఇది ఇజ్రాయెల్ జాతీయ పక్షి హుపో. హుద్ హుద్ అంటే ఆఫ్రో-యురేషియా అంతటా కనిపించే రంగుల పక్షి.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడును వణికిస్తున్న తుఫాన్‌కు 'మిచౌంగ్' 'మిగ్గామ్' అని ఉచ్చరించే మిచౌంగ్ పేరును మయన్మార్ సూచించింది. మిచౌంగ్ అంటే 'బలం' 'స్థిరత' అని అర్థం. ఈ తుఫాను ఇప్పుడు అందరిని వణికిస్తోంది.