Mon Dec 23 2024 18:49:39 GMT+0000 (Coordinated Universal Time)
Ratan Tata Personal Life: రతన్ టాటా పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉండిపోయారో తెలుసా?
రతన్ టాటా తన జీవితంలో భార్య లేదా కుటుంబం లేకపోవడంపై
86 సంవత్సరాల వయస్సులో అక్టోబర్ 9 న ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణించారు. ఆయన బ్రహ్మచారిగానే ఉండిపోయారు. వ్యాపారం, దానగుణంలో దిగ్గజంగా పేరు సంపాదించుకున్న ఆయన పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు.
రతన్ టాటా తన జీవితంలో భార్య లేదా కుటుంబం లేకపోవడంపై కొన్ని సందర్భాల్లో స్పందించారు. ఒంటరితనం క్షణాలను తాను కూడా అనుభవించినట్లు పంచుకున్నారు. "భార్య లేదా కుటుంబం లేని కారణంగా నేను చాలా సార్లు ఒంటరినై పోయినట్లు బాధను అనుభవించాను. కొన్నిసార్లు ఆ విషయం కూడా ఆలోచించాను" అని టాటా అంగీకరించారు. “కొన్నిసార్లు తాను వేరొకరి భావాల గురించి లేదా మరొకరి ఆందోళనల గురించి ఆందోళన చెందకుండా స్వేచ్ఛగా ఉన్నందుకు ఆనందించానని. కొన్ని సమయాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు కాస్త బాధగా కూడా ఉండేది” అని టాటా బయటపెట్టారు.
కొన్ని వరుస సంఘటనల కారణంగా కూడా తానూ పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాల్సి వచ్చిందని రతన్ టాటా వివరించారు. బిజినెస్ లో దిగిన సమయం, అలాగే ఆ సమయంలో తన జీవిత భాగస్వామికి సమయం కేటాయిస్తానో లేదో అనే భయం తనను వెంటాడాయని గతంలో రతన్ టాటా తెలిపారు. అంతేకాకుండా పెళ్లి దగ్గరకు వచ్చినా కూడా కొన్ని సార్లు అది కుదరలేదని వివరించారు. నటి సిమి గరేవాల్ కూడా ఒకసారి రతన్ టాటాతో డేటింగ్ చేశారు. పెళ్లి గురించి నాలుగు సార్లు సీరియస్గా ఆలోచించానని రతన్ టాటా చెప్పారు. అయితే ప్రతిసారీ ఏదో ఒక రకమైన భయంతో వెనక్కి తగ్గానని రతన్ టాటా వెల్లడించారు. అమెరికాలో పని చేస్తున్నప్పుడు తన ప్రేమను సాధించడం కోసం చాలా తీవ్రంగా ప్రయత్నించానని, అయితే భారత్ కు తిరిగి వచ్చిన తర్వాత తాము వివాహం చేసుకోలేకపోయామని రతన్ టాటా చెప్పారు. రతన్ టాటా జిజీ అనే ఆమెని ప్రేమించారు, ఆమె భారత్ కి రావడానికి ఇష్టపడలేదు. అదే సమయంలో ఇండో-చైనా యుద్ధం కూడా మొదలవ్వడంతో ఇద్దరి మధ్య మరింత దూరం పెరిగింది. చివరకు ఆమె అమెరికాలో మరొకరిని పెళ్లాడింది. ఈ కారణాలు రతన్ టాటాను పెళ్లికి దూరం చేశాయి.

Next Story