Mon Dec 23 2024 11:22:46 GMT+0000 (Coordinated Universal Time)
Parliament : డిసెంబరు 2న అఖిలపక్ష సమావేశం
పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబరు 4నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 2న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది
పార్లమెంటు శీతాకాల సమావేశాలు వచ్చే నెల 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రభుత్వం డిసెంబరు 2వ తేదీన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే దానికి రెండు రోజులు ముందుగానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొత్తం పంద్దొమ్మిది పనిదినాలు ఉండాలని నిర్ణయించామని తెలిపారు.
19 రోజులు పనిదినాలు...
శీతాకాల సమావేశాలు వచ్చే నెల 22వ తేదీ వరకూ జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధానమైన మూడు బిల్లులను ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీపీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ లపై చర్చ జరిగే అవకాశముందని చెబుతున్నారు. చీఫ్ ఎన్నికల అధికారి, ఎన్నికల అధికారుల నియామకాలకు సంబంధించిన బిల్లులను కూడా ప్రవేశపెడుతున్నారు. డిసెంబరు 3వ తేదీన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు జరిగిన వెంటనే సమావేశాలు ప్రారంభం కానుండటం విశేషం.
Next Story