Fri Nov 22 2024 20:58:05 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్రెషర్లకు షాకిచ్చిన విప్రో.. ప్యాకేజీలో సగం కోత
ట్విట్టర్, మైక్రో సాఫ్ట్, గూగుల్, మెటా.. ఇలా ఐటీ, సాఫ్ట్వేర్ దిగ్గజాలన్నీ వేలమంది ఉద్యోగులను రాజీనామా చేయాలని..
సాఫ్ట్ వేర్, ఐటీ రంగాల్లో ప్రస్తుతం తీవ్ర అనిశ్చితి కొనసాగుతోంది. ఆర్థికమాంద్యం, ద్రవ్యోల్బణం సాకులుగా చూపి.. వేలమంది ఉద్యోగులకు ఇప్పటికే లే ఆఫ్ లు ప్రకటించాయి. ట్విట్టర్, మైక్రో సాఫ్ట్, గూగుల్, మెటా.. ఇలా ఐటీ, సాఫ్ట్వేర్ దిగ్గజాలన్నీ వేలమంది ఉద్యోగులను రాజీనామా చేయాలని కోరాయి. తాజాగా విప్రో టెక్నాలజీస్ కూడా ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. లే ఆఫ్ ల పేరుతో ఇంటికి పంపకుండా.. ప్రకటించిన ఆఫర్ ప్యాకేజీలో సగం కోత విధించింది.
2022-23 వెలాసిటీ పట్టభద్రుల విభాగంలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి తొలుత 6.5 లక్షల వేతన ప్యాకేజీని విప్రో ఆఫర్ చేసింది. శిక్షణ పూర్తి చేసుకున్న వారిని వచ్చే నెల నుంచి విధుల్లోకి తీసుకునే ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఫ్రెషర్లకు ప్రకటించిన ఆఫర్ కాకుండా.. మూడున్నర లక్షల ప్యాకేజీ మాత్రమే ఇస్తామని ఈమెయిల్స్ పంపింది. ఈ ఆఫర్‌కు అంగీకరించి వెంటనే విధుల్లో చేరాలని, దీనికి ఓకే అంటే గత ఆఫర్ రద్దవుతుందని తెలిపింది. అసలు ఉద్యోగమే లేకపోవడం కన్నా ఎంతోకొంత వచ్చిన జీతానికి ఉద్యోగం చేసుకోవడం మంచిదన్న ఆలోచనలో ఉన్నారు నిరుద్యోగులు.
Next Story