Sat Dec 21 2024 05:01:45 GMT+0000 (Coordinated Universal Time)
వీళ్లసలు అమ్మాయిలేనా ? ఒక అబ్బాయి కోసం పొట్టు పొట్టు కొట్టుకున్నారు
అసలేం జరిగిందంటే.. బీహార్ లో ఓ యువతి తన ఫ్రెండ్స్ తో కలిసి జాతరకు వచ్చింది. అదే సమయంలో జాతరలో ఆమెకు
బీహార్లోని సోనేపూర్లో ఇద్దరు అమ్మాయి ఒక అబ్బాయి కోసం గొడవ పడ్డారు. గొడవంటే అలాంటి ఇలాంటి గొడవ కాదు. బట్టలు చిరిగేలా పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఆ గొడవ చూస్తే.. అసలు వీళ్లు అమ్మాయిలేనా ? అన్న సందేహం ఖచ్చితంగా కలుగుతుంది. జట్లు పట్టుకుని, కాళ్లతో తన్నుకుంటూ దారుణంగా కొట్టుకున్నారు. ఓ అబ్బాయి కోసం ఈ ఫైట్ జరిగిందని తెలిన వారంతా షాకవుతున్నారు.
అసలేం జరిగిందంటే.. బీహార్ లో ఓ యువతి తన ఫ్రెండ్స్ తో కలిసి సోనేపూర్లో జరుగుతున్న జాతరకు వచ్చింది. అదే సమయంలో జాతరలో ఆమెకు తన ప్రియుడు కనిపించాడు. అయితే, అతడి పక్కనే మరో అమ్మాయి ఉంది. దీంతో ఆ యువతి కోపం కట్టలు తెంచుకుంది. తన ప్రియుడి పక్కన ఉన్న అమ్మాయితో గొడవకు దిగింది. తిరగడానికి నా లవరే దొరికాడా ? అంటూ దాడి చేసింది. ఇద్దరి మధ్య గొడవ పెద్దదైంది. ఆ అమ్మాయిని జుట్టు పట్టుకుని లాగింది. కాళ్లతో తన్నింది.
ఆ యువతితో ఉన్న ఫ్రెండ్స్ ఆపాల్సిందిపోయి.. ఆమెకు సహకరించారు. నలుగురు అమ్మాయిలు కలిసి యువతిని దారుణంగా కొట్టారు. అమ్మాయిల దాడిలో బాధితురాలి దుస్తులు సైతం చిరిగిపోయాయి. అయినా వారు తగ్గలేదు. కొట్టుకోవడం ఆపలేదు. ఆ అబ్బాయి కూడా ఇద్దరినీ ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. అమ్మాయిల ఫైటింగ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీళ్ల ఫైటింగ్ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.
- Tags
- bihar
- WomenFight
Next Story