Sun Nov 24 2024 17:50:04 GMT+0000 (Coordinated Universal Time)
మరో త్యాగి.. ప్రియుడితో భార్యకు పెళ్లి
కిరాసి గ్రామానికి చెందిన మాధవ ప్రధాన్ మూడేళ్ల క్రితం అనుగుల్ ప్రాంతానికి చెందిన జిల్లిని వివాహమాడారు. ఇటీవల జిల్లి..
ఇటీవల కాలంలో మనుషుల ఆలోచనలు మారుతున్నాయి. ఇష్టం లేకుండా కలిసి ఉండే కంటే.. ఇష్టమైన వారిని పెళ్లాడి కష్టమైనా.. ఆనందంగా ఉండాలనుకుంటున్నారు. పెళ్లికాని వారే కాదు.. అయినవారిదీ అదే ధోరణి. కొందరు కుటుంబాన్ని వదిలేసి ప్రేమించిన వారితో లేచిపోతుంటే.. కొందరు మాత్రం తమ జీవిత భాగస్వాములకు.. వారు ప్రేమించిన వారితోనే దగ్గరుండి పెళ్లిళ్లు చేస్తున్నారు. తాజాగా అలాంటి మరో ఘటన ఒడిశాలోని సోన్ పూర్ జిల్లా శుభలాయి ఠాణా పరిధిలో జరిగింది. ప్రియుడితో వెళ్లిపోయిన భార్యను పోలీసుల సాయంతో తిరిగి తీసుకొచ్చి.. ప్రియుడితోనే ఆమెకు పెళ్లి జరిపించాడు.
కిరాసి గ్రామానికి చెందిన మాధవ ప్రధాన్ మూడేళ్ల క్రితం అనుగుల్ ప్రాంతానికి చెందిన జిల్లిని వివాహమాడారు. ఇటీవల జిల్లి దూరపు బంధువైన పరమేశ్వర ప్రధాన్ తో సన్నిహితంగా ఉంటున్నారు. గురువారం (జులై20) అతనితో కలిసి జిల్లి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దాంతో మాధవ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు జిల్లి, పరమేశ్వర్ లను వెతికి తీసుకొచ్చారు. జిల్లిని పోలీస్ అధికారి ప్రశ్నించగా.. తాను పరమేశ్వర్ తోనే ఉంటానని, అతడినే పెళ్లిచేసుకుంటానని తెలిపింది. దాంతో మాధవ కు పోలీసులు అంతా వివరించి.. జిల్లి- పరమేశ్వర్ ల పెళ్లికి ఒప్పించారు. మాధవ సమక్షంలోనే వారిద్దరికీ పెళ్లి జరిపించారు పోలీసులు.
Next Story