నన్ను చచ్చిపోనివ్వండంటూ రాష్ట్రపతికి లేఖ రాసిన మహిళ
తనను, తమ కుటుంబాన్ని ఎంతగానో హింసిస్తూ ఉన్నారని

తన తల్లిని సీనియర్లు వేధిస్తున్నారనే ఫిర్యాదు కారణంగా తనను, తమ కుటుంబాన్ని ఎంతగానో హింసిస్తూ ఉన్నారని, దయచేసి తనకు కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ లోని మాజీ డిప్యూటీ జైలర్ కుమార్తె రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాసింది. ఉత్తరప్రదేశ్ జైళ్ల శాఖలో పనిచేస్తున్న తన తల్లిని ఓ సీనియర్ అధికారి లైంగికంగా వేధిస్తున్నాడని, ఈ విషయంపై ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో నిరాశ చెందానని తెలిపారు. అధికారంలో ఉన్నవారితో పోరాడటం కష్టమని తెలిసినా, తన తల్లికి న్యాయం జరగాలని ఆమె కోరుతోంది. వారణాసి డిప్యూటీ జైలర్‌గా పనిచేసిన మహిళ, జిల్లా జైలు సూపరింటెండెంట్ ఉమేష్ కుమార్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. తనను వేధిస్తున్నాడని, కులం పేరుతో దూషిస్తూ అవమానించేవాడని ఆమె ఆరోపించింది. ఈ విషయమై బాధితురాలి కుమార్తె లాల్‌పుర్ పాండేపుర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.