Wed Nov 27 2024 13:36:16 GMT+0000 (Coordinated Universal Time)
మహిళకి మధ్యవేలు చూపితే.. 6 నెలలు జైలు శిక్ష
గొడవలో మహిళకు మధ్యవేలు చూపించిన వ్యక్తికి ముంబై గిర్గావ్ మెజిస్ట్రేట్ 6 నెలలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది
రోడ్డు మీద జరిగిన గొడవలో మహిళకు మధ్యవేలు చూపించి.. దుర్భాషలాడిన వ్యక్తికి ముంబై గుర్గావ్ మెజిస్ట్రేట్ ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. నిందితుడైన అనికేత్ పాటిల్ (33) 2018 సెప్టెంబర్ 17వ తేదీన 66 ఏళ్ల మహిళ, ఆమె కొడుకుతో నడిరోడ్డుపై వాదనకు దిగాడు. సదరు మహిళ, ఆమె కొడుకుడు ఆఫీసుకు వెళ్తూ కాడ్బరీ జంక్షన్ కు చేరుకున్నారు. ఉన్నట్లుండి తమకు ఎడమవైపు నుంచి ఓ రెడ్ కార్ వచ్చి డివైడర్ వైపుకు వెళ్తూ.. వారి మీదకు వచ్చింది. అలా 100 మీటర్ల వరకూ ఆ కారు వారి మీదకు వెళ్తూనే ఉంది. ఆఖరికి ఆ రెడ్ కారు నుంచి తప్పించుకుని తల్లీ, కొడుకు ప్రయాణిస్తున్న కారు సిగ్నల్ వద్ద ఆగింది.
కేసు నమోదుతో....
వారి కారు వెనుకనుంచి వచ్చిన రెడ్ కార్ ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నిస్తూ పక్కనే ఆగింది. వెంటనే విండో ఓపెన్ చేసి తిట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు కారులో ఉన్న వ్యక్తి. దాంతో మహిళ కొడుకు కారును అడ్డుపెట్టడంతో.. ట్రాఫిక్ జాం అయింది. సీన్ లోకి ట్రాఫిక్ పోలీస్ ఎంటరవ్వడంతో.. పాటిల్ ను గందేవీ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఆ రోడ్ మీద జరిగిన వాదనలో మధ్యవేలు చూపిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడని మహిళ ఫిర్యాదు చేసింది. సెక్షన్స్ 354ఏ, 345 డీ, సెక్షన్స్ 509 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ చేసిన గిర్గావ్ మెజిస్ట్రేట్.. ప్రతి మహిళకు సమాజంలో డిగ్నిటీతో బతికే హక్కు ఉంది. వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగేంచాలే ఏం చేసినా సమాజానికి తప్పుడు సందేశం అందుతుందని తెలుపుతూ.. నిందితుడైన పాటిల్ కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
Next Story